Homeసినిమా వార్తలుక్లాసికల్ హిట్ గా నిలిచిన సీతారామం

క్లాసికల్ హిట్ గా నిలిచిన సీతారామం

- Advertisement -

దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా `సీతా రామం`. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరించి ఏకగ్రీవంగా క్లాసికల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

అటు ప్రేక్షకుల ఆదరణను.. ఇటు విమర్శకుల నుంచి గొప్ప కితాబులను కూడా అందుకుని బాక్సాఫీస్ వద్ద తన హవాను కొనసాగిస్తుంది. తొలి రోజు కంటే తరువాతి రోజుల్లో ఎక్కువ కలెక్షన్లను సాధించడం విశేషం.


ఈ చిత్రాన్ని ఒక సరికొత్త ప్రయత్నంగా, ప్రేక్షకులను మాయ చేసిన ప్రేమకథగా రివ్యూయర్లతో పాటు ట్రేడ్ వర్గాలు వారు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇక ప్రఖ్యాత విమర్శకులు, సెలబ్రిటీలు కూడా ఈ దృశ్య కావ్యానికి మంత్ర ముగ్ధులు అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత అద్భుతంగా తెరకెక్కిన ప్రేమకథను చూడలేదంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్ ల నటనతో పాటు ప్రేమికులు గా వారు కెమిస్ట్రీ, శారీరకంగా కౌగిలింతలు వంటివి ఎక్కువ లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ను పండించిన తీరుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి మరో బ్యాక్ బోన్ గా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన పాటలు, హృద్యమైన నేపథ్య సంగీతం, హను రాఘవపూడి పటుత్వం ఉన్న దర్శకత్వంతో పాటు పీఎస్ వినోద్ స్టన్నింగ్ విజువల్స్.. వైజయంతీ స్వప్న సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్ని కలగలిపి ఈ సినిమాని క్లాసిక్ గా నిలబెట్టాయి.


మొదటి రోజు వసూళ్లు చూసిన అందరూ..ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడం కాస్త కష్టమేనని భావించారు. అయితే ఈ సినిమా బాగుంది అన్న టాక్ అలా పెరుగుతూ పోయి రెండవ రోజు నుంచీ ఈ చిత్రం తాలూకు కలెక్షన్లు దినదినాభివృద్ధి చెందుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా సెంటర్లలో ఈ సినిమా హౌస్ ఫుల్స్ లను నమోదు చేస్తూ మంచి వసూళ్లని రాబడుతోంది. సినిమా అద్భుతంగా ఉందన్న పాజిటివ్ టాక్ ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగి అది వసూళ్ల రూపంలో కనిపిస్తుంది.

READ  Modern love hyderabad web series: అభినందించదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ ...


ఇక ఈ సినిమా 5 రోజుల వరకూ సాధించిన కలెక్షన్లు ఎంతంటే 33 కోట్ల గ్రాస్ ను రాబట్టింది అని తేలింది. సాధారణంగా క్లాస్ సినిమాలకి చక్కం ఆదరణ లభించే యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే వారాంతాల్లోనే కాకుండా ఈ సినిమా సోమవారం మరియు మంగళవారం కూడా చక్కని  వసూళ్లని రాబట్టడం విశేషం. ట్రెండ్ చూస్తుంటే ఈ వారాంతంలోనే వన్ మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


మొత్తంగా చక్కని ప్రయత్నం అయిన సీతారామం సినిమా తన స్థాయికి తగ్గట్టు అటు హృదయపూర్వక అభినందనలతో పాటు వసూళ్లను కూడా మెరుగు పరుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తూ విజయపథంలో దూసుకు పోతుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  లైగర్ సినిమా సెన్సార్ టాక్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories