కోలీవుడ్ స్టార్ వెర్సటైల్ యాక్టర్ సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ ఫాంటసీ మూవీ కంగువ చేస్తున్నారు. ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీ పై సూర్య ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న కంగువ మూవీ నవంబర్ 14న ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇక దాని అనంతరం మరోవైపు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ఒక లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నారు సూర్య. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తి కాగా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దీనిని వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేయనున్నారు. అ
యితే విషయం ఏమిటంటే, ఈ రెండు సినిమాల అనంతరం ఆర్ జె బాలాజీతో తన కెరీర్ 45వ మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు సూర్య. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈమూవీని ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుండగా ఇందులో సీతారామం మూవీ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సూర్య ఇమేజ్ కి తగిన విధంగా స్క్రిప్ట్ సిద్దమైన ఈ డివోషనల్ ఫాంటసీ ఎంటర్టైనర్ లో రుక్మిణి వసంత్ కూడా మరొక హీరోయిన్ గా కనిపించనున్నారు. త్వరలో ఈ మూవీ షూట్ ప్రారంభం కానుంది.