Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: ఇంకా జోరు తగ్గని సీతా రామం.. కార్తీకేయ-2

Box-Office: ఇంకా జోరు తగ్గని సీతా రామం.. కార్తీకేయ-2

- Advertisement -

సీతా రామం మరియు కార్తికేయ 2 సినిమాలు విడుదలై దాదాపు 2-3 వారాలైంది, అయినప్పటికీ ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ వద్ద తమ విజయ ఢంకాను మోగిస్తూనే ఉన్నాయి. ఇతర చిత్రాల విడుదలలు కూడా ఈ సినిమాల హవాను ఆపలేకపోయాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి.

సీతా రామం చిత్రం దేశ వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లో కూడా చాలా మంచి విజయాన్ని సాధించింది. కార్తికేయ 2 హిందీ బెల్ట్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్‌లను వసూలు చేసింది. సీతా రామం సినిమా మొత్తంగా 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే కార్తికేయ 2 గ్రాస్‌లో 100 కోట్లకు పైగా సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇది నిజంగానే అపూర్వమైన, అసాధారణమైన విజయం అని చెప్పాలి.

దానికి తోడు, ఈ వారం భారీ హైప్ తో విడుదలైన విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం అత్యంత పేలవమైన సమీక్షలకు తోడు చాలా బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో .. సీతా రామం, కార్తీకేయ 2 చిత్రాలకు కలిసి వచ్చి వాటి కలెక్షన్స్ లో భారీ పెరుగుదల సాధ్య పడింది. వీకెండ్‌లో హౌస్‌ఫుల్ బోర్డులను నమోదు చేస్తూ ఈ రెండు సినిమాలు తమ జోరును కొనసాగిస్తున్నాయి.

READ  కార్తీకేయ-2 ఓటిటి రిలీజ్ డీటైల్స్

చాలా ఏరియాలలో లైగర్ సినిమా స్థానంలో కార్తికేయ 2 మరియు సీతా రామం చిత్రాల కోసం అదనపు షోలు జోడించబడుతున్నాయి. లైగర్ సినిమా భారీ ప్రమోషన్స్ తో భారతదేశాన్ని షేక్ చేయడానికి బయలుదేరి అనూహ్యంగా చతికిల పడింది. కానీ సీతా రామం మరియు కార్తికేయ 2 సినిమాలు మాత్రం ప్రి రిలీజ్ పెద్దగా హడావిడి చేయకుండానే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా ఉన్నాయి. సరైన కంటెంట్ ఉంటే ఎప్పుడూ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారు అనే విషయం మరోసారి ఈ రెండు సినిమాలు నిరూపించాయి. సినిమాలో స్టార్ హీరో ఉన్నాడా లేదా అన్నది ముఖ్యం కాదు, సినిమాను ఎంత చక్కగా తీసి అది ప్రేక్షకులలో వెళ్లేలా చేశారన్నది ముఖ్యం. ముందు సినిమాలో సరైన విషయం ఉంటే మిగతావి వాటంతట అవే దక్కుతాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Box-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories