ధనుష్ నటించిన సార్ (వాతి) శుక్రవారం విడుదలైంది మరియు అప్పటి నుండి, ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో, ధనుష్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ లోని ఒక థర్డ్-గ్రేడ్ జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు. అతను విద్యను వ్యాపారంగా మార్చడానికి ఉద్దేశపూర్వక పద్ధతులను ఆవలంబించే ఒక ఇన్‌స్టిట్యూట్‌కు వ్యతిరేకంగా నిలబడతాడు.
కాగా ఈ చిత్రం యొక్క మొదటి వారాంతంలో కలెక్షన్లు చాలా బాగా వచ్చాయి. మరియు సార్/వాతి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి మౌత్ టాక్ తెచ్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రం విడుదల రోజుకు ముందే పెయిడ్ ప్రీమియర్ స్క్రీనింగ్‌లతో పాజిటివ్ బజ్‌ను సృష్టించింది మరియు స్థిరమైన సంఖ్యలతో, ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్‌ను దాటింది.
కాగా ఈ ద్విభాషా చిత్రంతో తెలుగు భాషలో ధనుష్ అరంగేట్రం చేశారు. తమిళంలో వాతి టైటిల్ కాగా తెలుగులో సార్ పేరుతో విడుదలైంది. ఇక రెండు వెర్షన్లు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ధనుష్ చివరి చిత్రం తిరుచిత్రాంబలం కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ 3 రోజులకు దాదాపు 18 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తమిళ వెర్షన్ 32 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మొదటి వారాంతంలో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళనాడులో కూడా అదే స్థాయిలో 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 1.2 మిలియన్లు వసూలు చేసింది.
వాతి/సార్ సంయుక్త మీనన్, పి. సాయి కుమార్, తనికెళ్ల భరణి మరియు సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. విద్యను ప్రైవేటీకరించడానికి ఒక అత్యాశగల వ్యాపారవేత్త యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుని తను పని చేసే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందేలా చూసే ఉపాధ్యాయుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్‌లు నిర్మించారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.