Home సినిమా వార్తలు Sir Movie: ‘సార్’ మళ్లీ మాట మార్చారుగా!

Sir Movie: ‘సార్’ మళ్లీ మాట మార్చారుగా!

Dhanush Sir Movie Release To Postpone Again
Dhanush Sir Movie Release To Postpone Again

Sir Movie: తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సె్స్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌లు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను అందించారు. అయితే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా గతంలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో డిసెంబర్ 2న ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ, తాజాగా మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సార్ చిత్ర రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

సార్ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని.. అందుకే ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. ఇక జనవరిలో పలు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు రెడీ కావడంతో, సార్ మూవీ జనవరిలో కూడా రిలీజ్ కాదు. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో ధనుష్ సరసన అందాల భామ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version