Home సినిమా వార్తలు Silk Smitha Biopic Details సిల్క్ స్మిత బయోపిక్ డీటెయిల్స్

Silk Smitha Biopic Details సిల్క్ స్మిత బయోపిక్ డీటెయిల్స్

silk smitha biopic

తెలుగు సినీ పరిశ్రమలోని ఒకప్పటి దివంగత అందాల నటి మరియు డాన్సర్ పేరుగాంచిన సిల్క్ స్మిత తెలియని తెలుగువారు ఉండరు. అలానే తమిళ వంటి ఇతర భాషల్లో కూడా ఆమె ఆకట్టుకునే డాన్స్ లు నటనతో అందర్నీ అలరించారు.

ఇక ఇటీవల ఆమె బయోపిక్ మూవీ రూపొందుతుందన్న న్యూస్ వెల్లడైన విషయం తెలిసిందే. కాగా నేడు సిల్క్ స్మిత బర్త్ డే సందర్భంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చాయి.

ఆ సందర్భంగా టీమ్ ఒక గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసారు. STRI సినిమాస్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో ఈ సినిమా నిర్మిస్తుంది. యువ అందాల నటి చంద్రిక రవి ఇందులో సిల్క్ స్మితగా టైటిల్ పాత్ర పోషిస్తుండగా జయరాం శంకరన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీకి నిర్మాతగా ఎస్ బి. విజయ్ అమిర్త రాజ్ వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీ 2025 ప్రారంభంలో ఈ మూవీ బెగిన్ కానుండగా అన్ని పాన్ ఇండియన్ భాషల్లో కూడా దీన్ని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందనేది చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version