యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా యువ అందాల నటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జాక్.
ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మించారు. అయితే ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ముఖ్యంగా యాక్టింగ్ పరంగా హీరో సిద్దు ఆకట్టుకున్నప్పటికీ ఏమాత్రం పస లేని కథ, కథనాలు ఆడియన్స్ నుండి నెగటివిటీ అందుకున్నాయి.
మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయిన జాక్ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ని తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. కాగా ఈ మూవీ మే 8న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీకి అచ్చు రాజమణి, సామ్ సి ఎస్, సురేష్ బొబ్బలి సంగీతం అందించగా విజయ్ కె చక్రవర్తి ఫోటోగ్రఫి అందించారు. మరి థియేటర్స్ లో ఆకట్టుకోని ఈ మూవీ ఎంతరమేర ఓటిటిలో అలరిస్తుందో చూడాలి.