Homeసినిమా వార్తలుఆస్కార్ నామినేషన్స్ కు మూడు విభాగాలలో ఎంపికైన శ్యామ్ సింఘా రాయ్

ఆస్కార్ నామినేషన్స్ కు మూడు విభాగాలలో ఎంపికైన శ్యామ్ సింఘా రాయ్

- Advertisement -

నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా శ్యామ్ సింగరాయ్ చిత్రం ఆస్కార్‌కి పంపబడింది. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అవకపోయినా.. మొత్తంగా డీసెంట్ గానే ఆడింది.

తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తరువాత సినిమాకి అన్ని వైపుల నుండి ప్రేక్షకులు అద్భుతమైన ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇది ఒక క్లాసిక్‌ సినిమాగా అందరి చెతా పరిగణించబడింది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో వారాల తరబడి ప్రథమ స్థానంలో ట్రెండ్ అయింది. చాలా మంది ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక గత కొన్ని రోజులుగా నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంత గొప్పగా రాణించనప్పటికీ, ఓటిటిలో మాత్రం చక్కని స్పందన తెచ్చుకోవడం ఒక రకంగా నానికి ఆందోళన కలిగించే విషయం అని చెప్పవచ్చు. ఏ సినిమాకైనా ప్రశంసలు అవసరమే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అదే విధంగా బాక్సాఫీస్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం కదా.

READ  పుష్ప-2 లో ఐటెం సాంగ్ కు స్టార్ హీరోయిన్ కన్ఫర్మ్ ?

ఇక శ్యామ్ సింఘా రాయ్ సినిమా ఆస్కార్ అవార్డులో మూడు అవార్డులకు నామినేట్ అవడం చాలా మంచి విషయం. ఇంతకీ శ్యామ్ సింఘా రాయ్ సినిమా ఎంపికయ్యే అవకాశం ఉన్న విభాగాలు ఏంటంటే.. బెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు బెస్ట్ క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్ కోసం పోటీలో ఉంది. శ్యామ్ సింఘా రాయ్ కనీసం ఆస్కార్ అవార్డుకైనా ఒక విభాగంలో నామినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

ఈ చిత్రంలో కోల్‌కతా లొకేషన్స్‌లో సినిమాను అందంగా చిత్రీకరించినందున బెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరీ అవార్డ్ అయితే చాలా సముచితంగా అనిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు కాస్ట్యూమ్స్, డైలాగ్స్, సెట్ డిజైన్స్ కూడా చాలా చక్కగా పొందు పరిచారు. బెస్ట్ క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ కేటగిరీలో కూడా చాలా మంచి అవకాశం ఉందనే చెప్పాలి. ఎందుకంటే సాయి పల్లవి చేసిన మెస్మరైజింగ్ డ్యాన్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయింది. ప్రణవాలయ పాహి పాటలో ఆమె చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించింది.

READ  రికార్డు ధరకు అమ్ముడైన గాడ్ ఫాదర్ డిజిటల్ రైట్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories