Homeసినిమా వార్తలుShruthi Haasan: మరో పెద్ద తెలుగులో సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న శృతి హాసన్

Shruthi Haasan: మరో పెద్ద తెలుగులో సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్న శృతి హాసన్

- Advertisement -

శ్రుతిహాసన్ ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో పోటీగా విడుదలైన రెండు తెలుగు సినిమాలైన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డిలో నటించిన సంగతి తెలిసిందే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా, ఇప్పుడు శ్రుతిహాసన్ మరో భారీ చిత్రాన్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది.

దసరా తర్వాత నాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యూవ్ దర్శకత్వం వహిస్తుండగా, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇక తాజాగా అందించిన సమాచారం ఏంటంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ సెట్స్ లోకి అడుగు పెట్టారట. నాని, శ్రుతిహాసన్ కలిసి ఓ సినిమాలో నటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

గోవాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రుతిహాసన్ ఇప్పటికే జాయిన్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ లాంగ్ షెడ్యూల్ లో చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. డిసెంబర్ 22న విడుదల కానున్న వెంకటేష్ ‘సైంధవ్’కు పోటీగా క్రిస్మస్ వీకెండ్ సందర్భంగా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు నాని 30 రానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

READ  Nani: దసరా షూటింగ్ సమయంలో రెండు నెలలు నిద్రలేని రాత్రులు గడిపాను: నాని

వైరా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో నాని30 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హృదయం ఫేమ్ హెషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాను జాన్ వరుఘీస్ (ISC) సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories