సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ యాక్షన్ ఈమూవీ SSMB29 గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో ఈ మూవీని కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
ఎప్పటినుండో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ లో ఎన్నెన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ జనవరి 2న ముహూర్తం జరుపుకుని అక్కడి నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్, అలానే తాజాగా షూటింగ్ కూడా వేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరుగుతోంది.
మహేష్ తో పాటు పృథ్వీరాజ్, ప్రియాంక కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం ఈ మూవీకి సంబంధించి 30 సెకండ్స్ నిడివి గల ఒక చిన్న షూటింగ్ వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసారు. కాగా అది కొన్ని క్షణాల్లోనే విపరీతంగా వైరల్ అయింది.
కాగా కోట్లాది రూపాయల ఖర్చుతో వందలాది రోజుల పాటు ఎందరో శ్రమతో చిత్రించే సినిమాలని ఈ విధంగా లీక్ చేయడం దారుణం అంటూ పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇటువంటి లీక్స్ ని ఎవరూ ప్రోత్సహించకూడదు సరికదా, ఇకపై చిత్ర సీమ కూడా వీటి విషయమై మరింత గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి. మరి తాజగా లీక్ వీడియో పై SSMB 29 మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2027 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది.