Homeసినిమా వార్తలుLatest Intresting Update on Devara 2 '​దేవర - 2' లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్...

Latest Intresting Update on Devara 2 ‘​దేవర – 2’ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ 

- Advertisement -

​టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా రెండు సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ తో కలిసి ఆయన చేస్తున్న వార్ 2 మూవీ కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తీస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. 

ఈ రెండు సినిమాల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వార్ 2 వేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈమూవీ ఆగష్టు 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. 

కాగా ప్రశాంత్ నీల్ మూవీ 2026 జనవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇటీవల దేవర పార్ట్ 1 మూవీతో పెద్ద విజయం అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, దాని యొక్క సీక్వెల్ ని త్వరలో చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. అయితే దేవర పార్ట్ 1 క్లైమాక్స్ అందరినీ నిరాశపరచడంతో పార్ట్ 2 పై పెద్దగా ఎవరికీ ఆసక్తి ఏర్పడలేదు. 

READ  Jr NTR Next Movie with Tamil Director Fixed నెక్స్ట్ ఆ తమిళ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ఫిక్స్ 

కాగా పార్ట్ 2 యొక్క కథ, కథనాలు ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఆకట్టుకునే రీతిన సిద్ధం చేస్తున్నారని, వార్ 2 అలానే ప్రశాంత్ నీల్ మూవీస్ అనంతరం ఎన్టీఆర్ ఈ మూవీనే చేయనున్నారని టాక్. మరోవైపు తమిళ దర్శకుడు నెల్సన్ తో కూడా ఎన్టీఆర్ ఒక మూవీ కమిట్ అయ్యారు. అయితే ప్రస్తుతం రజినీకాంత్ తో జైలర్ 2 తీస్తున్న నెల్సన్ దానిని పూర్తి చేయడనికి చాలనే సమయం పట్టేలా ఉంది. కాగా దేవర 2 వచ్చే ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

Follow on Google News Follow on Whatsapp

READ  Suriya Retro Telugu Teaser Release సూర్య 'రెట్రో' తెలుగు టీజర్ రిలీజ్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories