Homeసినిమా వార్తలుRC 15: 15 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పాటను తెరకెక్కించనున్న శంకర్

RC 15: 15 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పాటను తెరకెక్కించనున్న శంకర్

- Advertisement -

శంకర్ సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సందేశం కోసం కూడా అంతే గొప్పగా ప్రసిద్ధి చెందాయి. ఆయన అదనపు శ్రద్ధతో, శ్రమతో పాటలను చిత్రీకరిస్తారు. ఈ క్ర‌మంలో సినిమా బ‌డ్జెట్ పాట‌ల‌కే చాలా ఖ‌ర్చు అవుతూ ఉంటుంది అనుకోండి. విజువల్ ఎఫెక్ట్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ వంటి ఆకట్టుకునే అంశాలు సినిమా లోని భారీ స్థాయిని ప్రతిబింబిస్తాయి.

శంకర్ సినిమాలు బెస్ట్ వర్క్ మరియు క్లాసిక్స్ కావడానికి పాటలు కూడా ఒక కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. యుట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన పాటలలో శంకర్ గత చిత్రాల పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు.

తాజా వార్తల ప్రకారం, RC15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రంలోని ఒక పాటను 12 రోజుల పాటు చిత్రీకరించనున్నారు మరియు ఈ పాట కోసం ఏకంగా15 కోట్లు ఖర్చు పెట్టనున్నారట. ఈ పాట షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సినిమా పై హైప్‌ను పెంచింది. సాదారణంగా ఒక పాటకు 15 కోట్లు అంటే చాలా మీడియం రేంజ్ సినిమాలు ఆ బడ్జెట్‌తో తీస్తారు. ఒక పాట కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఊహించని విషయం.

READ  పాజిటివ్ బజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఓరి దేవుడా

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్‌లలో రామ్ చరణ్ ఒకరని అందరికీ తెలిసిందే. RRR సినిమా తర్వాత శంకర్‌ వంటి పెద్ద దర్శకుడితో తమ హీరో కలసి నటించడం మెగా అభిమానులకు ప్రత్యేకంగా ఉంటుంది కదా. వారు ఇప్పటికే భారీ సెట్లు మరియు అందమైన లొకేషన్లతో పాటు అద్భుతమైన కొరియోగ్రఫీని ఊహించుకుంటున్నారు.

వారి ఊహలకు బలం చేకూరుస్తూ పాట బడ్జెట్‌కు సంబంధించిన ఈ తాజా వార్త అభిమానులను పిచ్చెక్కిస్తోంది. శంకర్ పాటల చిత్రీకరణకు అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారట. అలాగే జానీ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్‌లు ఇప్పటికే మంచి డ్యాన్స్ నంబర్ చేసారని, పాట కన్నుల పండువగా ఉంటుందని వినిపిస్తుంది. ఇక ఈ సినిమా పై హైప్‌ని రెట్టింపు చేస్తూ, న్యూజిలాండ్‌లో చిత్రీకరించనున్న ఈ పాటకు సంబంధించిన ఈ తాజా వార్త అభిమానులకు కిక్ ఇస్తోంది.

రామ్‌చరణ్‌తో పాటు కియారా అద్వానీ ఈ పాటకు డ్యాన్స్ చేయనున్నారు ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు ఎందుకంటే ఇది ఆయన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, అంతే కాకుండా ఆయన బ్యానర్‌ లోనే అత్యంత ఖరీదైన చిత్రం.

READ  SSMB28 2వ షెడ్యూల్ డేట్ల సమస్యల వల్ల వాయిదా వేయబడిందా?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories