రెండు రోజుల క్రితమే శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ విడుదలైనది. అప్పటివరకు ఈ సినిమా పై ఉన్న అంచనాలని ట్రైలర్ బాగా వచ్చి సినిమా మీద ఆసక్తిని మరింత పెంచేసింది. ఇంతకుముందు ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే కోవలో వెళ్ళింది.
మంచి కంటెంట్‌ని తప్పకుండా ఆదరించే ప్రేక్షకుల్లో ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. కార్తికేయ 2 తరువాత తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన దాదాపు అన్ని చిత్రాలు పరాజయం పాలైన దశలో ఓకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ఆశలను కలిగిస్తుంది. ట్రైలర్ ఖచ్చితంగా సినిమా బిజినెస్ కి బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక హీరో శర్వానంద్.. ఈ సినిమా బజ్‌ని మరింత పెంచేందుకు తనకి సన్నిహితులు మేటియి స్నేహితులైన హీరో ప్రభాస్, రామ్ చరణ్‌ల కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట . శర్వానంద్, ప్రభాస్ ఎల్లప్పుడూ సన్నిహిత బంధాన్ని పంచుకుంటారు అన్న విషయం తెలిసిందే . పైగా బాహుబలి స్టార్ ఈ సినిమాను చూసి బాగుందని చెబితే, ఈ చిత్రానికి అది గొప్పగా సహాయపడుతుంది. రామ్ చరణ్, శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు అవడం వల్ల శర్వా కోసం చరణ్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎలాగూ ముందుకు వస్తారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబితే ఆయనకున్న ఫాలోయింగ్ వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు ఓకే ఒక జీవితం సినిమా చూడటానికి దోహదపడుతుంది.
ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే శర్వానంద్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. మహానుభావుడు సినిమా తరువాత సరైన విజయం లేని శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ కొట్టడం ఆయన కెరీర్ కు చాలా అవసరమైన విషయం. ఈ సినిమాతో హిట్ సాధించి ఆయన మార్కెట్ లో తిరిగి మళ్ళీ ఒక గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.
ఒకే ఒక జీవితం సినిమాలో ప్రధాన పాత్రలో శర్వానంద్, హీరోయిన్ గా రితు వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి పులికొండ, అమల అక్కినేని ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడుగా కూడా వ్యవహరించగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.