Homeసినిమా వార్తలురెండు పడవల్లో ప్రయాణం చేయనున్న శంకర్

రెండు పడవల్లో ప్రయాణం చేయనున్న శంకర్

- Advertisement -

దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడైన శంకర్.. ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంతకాలంగా తన స్థాయి విజయం లేని శంకర్ ఈ సినిమా తో మళ్ళీ తనదైన శైలిలో సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కలగలిపిన సినిమా తీసి గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని అందరిలోనూ నమ్మకం ఉంది.ఇక ఈ చిత్రం పట్ల ప్యాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ సినిమా తర్వాత శంకర్ నుంచి ఆసక్తికర లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఆయన ఇదివరకే మొదలు పెట్టి ఆపేసిన “భారతీయుడు 2” కూడా ఒకటి. భారీ హైప్ తో మొదలైన ఆ సినిమా షూటింగ్ అనుకోని పరిస్థితుల్లో ఆపేయాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులకు అన్ని సమస్యలు తీరిపోయి మళ్ళీ భారతీయుడు 2 సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే ముందు కమల్ హాసన్ తో భారతీయుడు సినిమా పూర్తి చేసిన తర్వాత ఈ శంకర్ రామ్ చరణ్ తో సినిమా సెట్స్ లోకి తిరిగి వస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కే ఆలోచనలో ఉన్నారట శంకర్.

READ  NKR-19: కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు క్రేజీ ఆఫర్

ఓ పక్క ఇండియన్ 2/భారతీయుడు 2 సినిమాను సెప్టెంబర్ నుంచే మొదలు పెట్టనున్నారని వార్తలు వస్తుండగా.. మరోపక్క చరణ్ సినిమా కూడా ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు సమాచారం. అంటే ఈ వార్తలు నిజం అయితే శంకర్ రెండు సినిమాలకి ఒకేసారి దర్శకత్వం వహించనున్నారని అర్ధం అవుతుంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక శంకర్ – రామ్ చరణ్ ల కాంబినేషన్లో వస్తున్న సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కోట్ల రూపాయల డబ్బుని ఖర్చు చేస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందు శంకర్ స్థాయిని దిల్ రాజ్ అందుకోలడా? అని పలు సందేహాలు వ్యక్తమైనా వాటన్నింటినీ తోసేసి ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి దిల్ రాజుతో పాటు జీ స్టూడియోస్ కూడా సహా నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ కి ఉన్న సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మొట్ట మొదటి సారిగా శంకర్ తో పని చేస్తున్న తమన్ అదిరిపోయే పాటలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

READ  జూలై ఒకటో తారీఖు నుంచి ఓటిటిలో ఆలస్యంగా రానున్న సినిమాలు

భారీ అంచనాలతో వస్తున్న రామ్ చరణ్ – శంకర్ సినిమాకి అందరూ తమ పనిని ఎంతో భాధ్యతతో మరియు ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నారు. మరి వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించే విధంగా సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories