Home సినిమా వార్తలు రామ్ చరణ్ సినిమాని పక్కన పెట్టి భారతీయుడు 2 పై దృష్టి పెట్టిన శంకర్

రామ్ చరణ్ సినిమాని పక్కన పెట్టి భారతీయుడు 2 పై దృష్టి పెట్టిన శంకర్

Indian 2 Is On Track Now; The Team Locks Release Plans

దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సినిమా కాగా.. మరొకటి కమల్ హాసన్ నటించబోయే భారతీయుడు 2.రామ్ చరణ్ నటిస్తున్న RC15 షూటింగ్ చాలా వరకు సాఫీగానే సాగినా, ఇండియన్ 2 మాత్రం శంకర్‌కి చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న RC15 షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది మరియు దాదాపు యాభై శాతం పూర్తయింది.ఇక ఇండియన్ 2 షూటింగ్ 2019లో కొద్ది రోజులు జరిగింది కానీ కొన్ని అనుకోని సమస్యల వల్ల అనేక జాప్యాలను ఎదుర్కొంటోంది.

మొదట్లో అంతా సజావుగానే సాగింది. అయితే దురద్రుష్టవశాత్తూ షూటింగ్ సమయంలో క్రేన్‌ ముగ్గురు సిబ్బందిపై పడటంతో ఘోర ప్రమాదం జరిగింది, ఈ క్రమంలో వారు మరణించారు. అలాంటి దుర్ఘటన జరిగినందుకు షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.ఆ తరువాత షూటింగ్ కొనసాగింపు విషయమై చిత్ర నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్స్ మరియు శంకర్‌కు మధ్య చాలా విభేదాలు వచ్చాయి. కమల్ హాసన్ బాక్సాఫీస్ స్టేటస్ కారణంగా ఆయన కోసం ఇంత బడ్జెట్ భరించగలరో లేదో అనే విషయాన్ని లైకా సంస్థ కూడా ఖచ్చితంగా చెప్పలేదు. కానీ విక్రమ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ బాక్సాఫీస్ స్టామినాపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవనే చెప్పాలి.

దీంతో మళ్లీ ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే స్థితికి వచ్చింది. అందువల్ల రామ్ చరణ్ సినిమాని కొద్ది రోజులు పక్కన పెట్టి శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై శంకర్ దృష్టి పెట్టనున్నారు. తన దర్శకుడు శంకర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కమల్ కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. ఇండియన్ 2 షూటింగ్ ఆగస్టు 24న చెన్నైలో పునఃప్రారంభం కానుంది. కొద్దిరోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో కమల్ కూడా భాగం అవుతారు. ఈ చిత్రాన్ని 2023 దీపావళికి విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version