Homeసినిమా వార్తలుPathan: చిక్కుల్లో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా - చిత్ర బృందానికి మధ్య ప్రదేశ్...

Pathan: చిక్కుల్లో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా – చిత్ర బృందానికి మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి హెచ్చరిక

- Advertisement -

షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 25న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలకు సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ వస్తోంది. బాలీవుడ్ సినిమాలను బహిష్కరించాలని ప్రేక్షకులు, నెటిజన్లు ప్రచారం చేయడాన్ని మనం గమనించవచ్చు. షారూఖ్ ఖాన్ యొక్క పఠాన్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

ఈ సినిమాకు ఎటువంటి నెగిటివిటీ లేకుండా చూసుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తుండగా, తాజాగా వారి పైకి ఒక కొత్త సమస్య వచ్చింది.

Besharam Song

ఇటీవల పఠాన్ సినిమా నుండి ‘బేషరం రంగ్’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ మరియు దీపికా పదుకొనె ఇందులో ఆడి పాడారు. ఈ రొమాంటిక్ సాంగ్ లో దీపికా పదుకొనె బికినీ ధరించారు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది.

పాటలో హీరోయిన్ డ్రెస్సింగ్ అభ్యంతరకరంగా ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ బేషరం రంగ్ లో ఉపయోగించిన కాస్ట్యూమ్స్ ఖచ్చితంగా అభ్యంతరకరంగా ఉన్నాయని, వారు ఈ పాటను మురికి మనస్తత్వంతో చిత్రీకరించారని అన్నారు.

READ  ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న తెలుగు సినిమాల వివరాలు

బేషరం రంగ్ పాట, సన్నివేశాలను తదనుగుణంగా సరిచేయాలని, లేదంటే పఠాన్ ను మధ్యప్రదేశ్ లో విడుదల చేయాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుందని ఆయన పఠాన్ చిత్ర బృందానికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే దీని పై చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి.

పఠాన్ ట్రైలర్ కు ముందే పాటలను విడుదల చేయడం ద్వారా పఠాన్ సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేశారు నిర్మాతలు. అందులో భాగంగా బేషరం రంగ్ పాటను విడుదల చేశారు.

READ  తన పెళ్ళి పుకార్ల పై సరదాగా స్పందించిన తమన్నా

దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తరువాత షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్ వస్తున్నందున ఆయన అభిమానులు మరియు చిత్ర పరిశ్రమ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం మరో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories