Homeసినిమా వార్తలుPathaan: షారుఖ్ ఖాన్ తెలుగు రాష్ట్రాల్లో పఠాన్ సినిమా చూడాలని అనుకుంటున్నారు కానీ అందుకు ఓ...

Pathaan: షారుఖ్ ఖాన్ తెలుగు రాష్ట్రాల్లో పఠాన్ సినిమా చూడాలని అనుకుంటున్నారు కానీ అందుకు ఓ షరతు పెట్టారు

- Advertisement -

షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది.అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తూ ఉంటే ఈ సినిమా బాలీవుడ్ ఓపెనింగ్ కలెక్షన్స్ లో నెక్ట్స్ బెంచ్ మార్క్ సెట్ చేసే లానే కనిపిస్తుంది. దిపికా పదుకొనె, జాన్ అబ్రహం ముఖ్య పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో పఠాన్ ను తెలుగులో చూసేందుకు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లకు వెళ్లే ఆలోచన ఉందా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ బాద్ షా స్పందిస్తూ రామ్ చరణ్ తనను వెంట తీసుకెళ్తే తప్పకుండా సినిమా చూస్తానని బదులిచ్చారు.

మరి ఇప్పుడు బంతి చరణ్ కోర్టులో ఉండటంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి సమాధానం ఏమై ఉంటుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

READ  2022 Recap: 2022 సంవత్సరం టాలీవుడ్ టాప్ హీరోల బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ మరియు ర్యాంకింగ్స్

తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ విజయం పై ఆర్ అస్ ఆర్ టీమ్ ను అభినందిస్తూ షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్ ఖాన్ 4 సంవత్సరాల తర్వాత వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం పఠాన్. ఆయన చివరిసారిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన జీరో చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించారు. పఠాన్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Pathaan: షారుఖ్ ఖాన్ పఠాన్ హిందీలో కేజీఎఫ్ 2 ఓపెనింగ్ రికార్డును బ్రేక్ చేస్తుందా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories