యువ నటుడు ఆది పినిశెట్టి హీరోగా లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, ఎంఎస్ భాస్కర్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన లేటెస్ట్ థ్రిల్లింగ్ సస్పెన్స్ హారర్ సినిమా శబ్దం. ప్రారంభం నాటి నుంచి ప్రచార చిత్రాలతో అందరిలో మంచి హైప్ ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
అరివళగన్ తెరకెక్కించిన ఈ సినిమాని సెవెన్ జి ఫిలిమ్స్ మరియు ఆల్ఫా ఫ్రేమ్స్ వారు భారీ స్థాయిలో తెరకెక్కించారు. మరి ఈ సినిమా యొక్క ఫుల్ రివ్యూ ఇప్పుడు చూద్దాం.
సినిమా పేరు: శబ్దం
రేటింగ్: 2.75 / 5
తారాగణం: ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, ఎం.ఎస్. భాస్కర్, మరియు రెడిన్ కింగ్స్లీ మరియు ఇతరులు
దర్శకుడు: అరివళగన్
నిర్మాతలు: 7G ఫిల్మ్స్ ,ఆల్ఫా ఫ్రేమ్స్
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2025
కథ :
70 ఏళ్ళ అపార చరిత్ర కలిగిన హోలీ ఏంజెల్స్ కాలేజీ ఆవరణలో అనేకమంది పలు కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం వలన అందరూ ఆ కాలేజీ విషయమై అక్కడ దెయ్యాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు.
అయితే రాను రాను ఆ విధంగా అందరూ ఆ కాలేజీ అంటే భయపడితే అది దానికి ముప్పు తీసుకువస్తుందని భావించిన డీన్ మిస్టర్ వ్యోమా (ఆది పినిశెట్టి) ఒక సొల్యూషన్ కనుగొంటారు. మరి అతడు కనుగొన్నది ఏమిటి, ఆ విధంగా అసలు ఆ కాలేజీలో అనేకమంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అనే కథ మొత్తం తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ :
ముఖ్యంగా ఎప్పటి మాదిరిగా మరొక్కసారి శబ్దం మూవీలోని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకున్నారు నటుడు ఆది పినిశెట్టి. హీరోయిన్ లక్ష్మి మీనన్ పాత్ర బాగుంది, తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆమె మెప్పించింది. ఇక హీరోకి అసిస్టెంట్ గా వ్యవహరించిన రెడిన్ కింగ్స్లే తన హాస్యంతో అలరించారు. కీలక పాత్ర చేసిన సిమ్రాన్, రాజీవ్ మీనన్ తదితరులు అందరూ కూడా తమ పెర్ఫార్మన్స్ లతో అలరించారు.
విశ్లేషణ :
ముఖ్యంగా ఇంట్రస్టింగ్ పాయింట్ తో రూపొందిన శబ్దం మూవీ మొదట జరిగే ఒకరి డెత్ సీన్ తో ప్రారంభం అయి అందరిలో కూడా అంచి ఆసక్తిని ఏర్పరుస్తుంది. అక్కడి నుండి ఒక్కొక్కటిగా వచ్చే సీన్స్ కథ కథనాలు ఆడియన్స్ లో మూవీ పై మంచి ఇంట్రెస్ట్ ఏర్పరుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆకట్టుకోవడంతో పాటు సెకండ్ హాఫ్ పై మరింత ఇంట్రస్ట్ ఏర్పరుస్తుంది.
అయితే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తప్ప చాలా వరకు సీన్స్ మనకు ఊహాజనితంగా ఉంటాయి. అలానే క్లమాక్స్ కూడా ఆకట్టుకునే స్థాయిలో లేదు. నిజానికి కాలేజీలో వరుస చావుల కారణం తెలిసిన అనంతరం మంచి ఎమోషనల్ ఇంప్యాక్ట్ వచ్చినా, దానిని ఆకట్టుకునే రీతిగా దర్శకుడు సెకండ్ హాఫ్ లో చూపించలేదు.
ప్లస్ పాయింట్స్ :
- మెయిన్ పాయింట్
- ఫస్ట్ హాఫ్
- సౌండ్ మిక్సింగ్, కొన్ని విజువల్స్
మైనస్ పాయింట్స్ :
- వీక్ సెకండ్ హాఫ్
- ఊహించదగిన ట్విస్టులు
- కొన్ని కన్ఫ్యూజ్ చేసే సీన్స్
తీర్పు :
మొత్తంగా అయితే హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ గా అందరిలో మంచి ఆసక్తిని ఏర్పర్చిన శబ్దం మూవీ ఫస్ట్ హాఫ్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో అయితే లేదు. ముఖ్యంగా అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో చాలా వరకు సీన్స్ ఊహాజనితంగా ఉండడం, నార్మల్ క్లైమాక్స్ వంటివి పెద్దగా అలరించవు. అయితే అది పినిశెట్టి యాక్టింగ్, ఫస్ట్ హాఫ్, సౌండ్ మిక్సింగ్ వంటివి బాగున్నాయి. ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ హర్రర్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఇది పర్వాలేదనిపించవచ్చు.