నందమూరి అభిమానులకు సెప్టెంబర్ నెల మంచి ట్రీట్ అందించనుంది. ముందుగా సెప్టెంబర్ 6న నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందనుండగా ఇందులో బాలకృష్ణ కూడా ఒక ముఖ్య పాత్ర చేయనున్నట్లు టాక్.
ఇక బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా సెప్టెంబర్ 10న సిల్వర్ జూబ్లీ వేడుక జరగనుండగా దీనిని అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
కాగా చివరిగా సెప్టెంబర్ 27న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1 ఆడియన్స్ ముందుకి రానుంది. అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్, ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ఈ సెప్టెంబర్ నెల నందమూరి నామ నెలగా మారిందని తెలుస్తోంది.