Homeబాక్సాఫీస్ వార్తలుతెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిన కాంతార

తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించిన కాంతార

- Advertisement -

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన తాజా చిత్రం కాంతార బాక్సాఫీస్ వద్ద నెమ్మదించే సూచనలు అస్సలు కనిపించడం లేదు. అద్భుతమైన టాక్ తో పాటు సినిమా చుట్టూ విపరీతమైన హైప్ ఉండటంతో ఈ సినిమాకి అడ్డే లేకుండా పోతుంది, ఈ చిత్రం దేశంలో విడుదలైన ప్రతి భాషలోనూ రాణిస్తుంది. మరియు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్‌తో ప్రతి రోజూ ముఖ్యాంశాలలో నిలుస్తుంది.

ముఖ్యంగా తెలుగులో కాంతార సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణ రోజుల్లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తోంది, వీక్ డేస్‌లో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు, ఇది ఈ మధ్య కేవలం వారాంతాల్లో మాత్రమే మంచి కలెక్షన్లు సాధిస్తున్న సినిమాల ట్రెండ్‌ను పరిశీలిస్తే చెప్పుకోదగ్గ విషయమే.

ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల షేర్ మార్క్‌ను తాకింది. కాగా రన్ ముగిసే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల షేర్ మరియు 50 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు ఎవరూ ఊహించి ఉండరు. ఫస్ట్ వీకెండ్ కంటే సెకండ్ వీకెండ్ లో కాంతార కలెక్షన్ల జోరు బాగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగ వారాంతం కావడంతో అలా జరగడం సాధ్యమేనని చెప్పచ్చు.

READ  బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తున్న కాంతార

ఇక మిగతా వెర్షన్లకి వస్తే కాంతార అదే జోరును కొనసాగిస్తుంది . హిందీలో ప్రతిరోజు 1 కోటి నెట్‌ని వసూలు చేస్తూ పటిష్టంగా ఉంది. కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో మొత్తంగా 200 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

విడుదలైన మూడు వారాల్లోనే, రిషబ్ శెట్టి యొక్క సంచలనాత్మక చిత్రం కాంతార చిత్రం ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది, కాగా ఈ సినిమా విడుదలకు ముందు ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్న రికార్డులను కొల్లగొట్టడం విశేషం.

కాంతార సినిమా విజయం మరియు ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తుంటే, ఈ రోజుల్లో ప్రేక్షకులు రొటీన్ స్టోరీస్ కంటే సినిమాలలో నుండి ఏదో ఒక ప్రత్యేకతను ఆశిస్తున్నారని సోషల్ మీడియాలో మరియు పరిశ్రమ వర్గాల ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా దూసుకుపోతున్న కాంతార


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories