నటి పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు
పవిత్రా లోకేష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె తెలుగులో చాలా సినిమాలలో ఎన్నో మంచి పాత్రలు చేశారు. అయితే ఇటీవలి కాలంలో, ఆమె చిత్రాల కంటే వ్యక్తిగత విషయాలు మరియు వివాదాలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం నరేష్, పవిత్ర లోకేష్ మైసూరు హోటల్ గదిలో ఉండగా… నరేష్ మూడో భార్య రమ్య వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఆమె ఇద్దరి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియో అప్పట్లో మీడియాలో వైరల్‌గా మారింది. నరేష్, పవిత్ర మీడియా ముందుకు వచ్చి తాము అమాయకులమని చెప్పారు. ఆ తర్వాత వీరి ఎఫైర్ పై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.
అయితే తాజాగా పవిత్రా లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అభ్యంతరకర వ్యాఖ్యలతో మార్ఫింగ్ చేస్తున్నారని, నెటిజన్లు తనను మానసికంగా వేధిస్తున్నారని నటి పవిత్రా లోకేశ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫేక్ అకౌంట్లు ఉన్న వ్యక్తులు తన ఫొటోలను మార్ఫింగ్ చేసి తన పరువు తీస్తున్నారని రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసారు పవిత్రా. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్‌లు నరేష్, పవిత్రా లోకేష్‌ల పై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారని, తన పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాంటి వారి పై తక్షణ చర్యలు తీసుకోవాలని పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.