HomeSatyam Sundaram First Weekend Collections 'సత్యం సుందరం' ఫస్ట్  ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 
Array

Satyam Sundaram First Weekend Collections ‘సత్యం సుందరం’ ఫస్ట్  ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 

- Advertisement -

కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీ, సీనియర్ నటుడు అరవింద్ స్వామిల కలయికలో హృద్యమైన సినిమాల దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సత్యం సుందరం. ఈ మూవీని 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించగా గోవింద్ వసంత సంగీతం అందించారు. 

సెప్టెంబర్ 28న ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఫస్ట్ డే నుండి మంచి టాక్ ని సొంతం చేసుకున్న సత్యం సుందరం మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. తమిళనాడులో ఈ మూవీ దాదాపు రూ. 11 కోట్ల గ్రాస్ ని తెలుగు వెర్షన్ లో రూ. 3 కోట్లు అలానే కేరళ మరో రూ. 40 లక్షలు రాబట్టింది. 

ఇండియా వైడ్ గ్రాస్ మొత్తం రూ. 16 కోట్లు. ఇక ఓవర్సీస్‌లో రూ. 8 కోట్ల గ్రాస్‌ తో మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. ఆ విధంగా ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా సత్యం సుందరం మూవీ టోటల్ గ్రాస్ రూ. 24 కోట్లు. మొత్తంగా ఈ మూవీ బాక్సాఫీస్ పరంగా యావరేజ్ నుండి డీసెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఎంత రాబడుతుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories