సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు పలు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం వాటిలో కొన్ని పరాజయం పాలైతే మరికొన్ని విజయవంతం అవ్వడం చూస్తుంటాం. అలానే అందులో కొన్ని భారీ విజయాలు అందుకుని ఆడియన్స్ ని మరింతగా అలరిస్తూ ఉంటాయి. అటువంటి సినిమాలు ఆడియన్స్ మదిలో నిలిచిపోతాయి కూడా. ఆ విధంగా నిలిచిపోయేవాటిలో 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ ఒకటి.
అంతకముందు పదేళ్లుగా సరైన సక్సెస్ లేని పవన్ ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ ని అందించింది. అటు ఆడియన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. అయితే అది అక్కడివరకు బాగానే ఉంది. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందదర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకనిర్మాతలు బండ్ల, హరీష్ మాట్లాడారు. ముఖ్యంగా ఈ మూవీని అలానే పవన్ ని ఆకాశానికి ఎత్తేసారు.
నిజానికి తమ సినిమాని, తమకు నచ్చిన హీరోని వారు పొగుడుకోవడం బాగానే ఉందని, అయితే అది మరింతగా శృతిమించి పవన్ కు ప్రత్యేకంగా భజన చేస్తున్నట్లు అనిపిస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ హిట్ కాదు, మంచి బ్లాక్ బస్టర్ అంతే. అలానే పవన్ స్థాయిలో మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు భారీ క్రేజ్ భారీ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టడంతో వారిని, వాళ్ళ అభిమానులని ఒకింత పరోక్షంగా విమర్శించేలా హరీష్, బండ్ల గణేష్ ల మాటలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం వారిద్దరి భజన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా సెటైరికల్ గా ట్రెండ్ అవుతున్నాయి.