Homeసినిమా వార్తలుమహేష్ బాబు థియేటర్ లో సర్కారు వారి పాట రికార్డ్

మహేష్ బాబు థియేటర్ లో సర్కారు వారి పాట రికార్డ్

- Advertisement -

మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” చిత్రం గత నెల మే 12 న విడుదల అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ లో ఉన్న వినోదం సెకండాఫ్ లో లేదని ప్రేక్షకులు కాస్త నిరాశ పడినా, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లపై మాత్రం పెద్దగా తేడా రానివ్వలేదు సూపర్ స్టార్ మహేష్.

గత వారం పే పర్ వ్యూ మోడ్ లో అమెజాన్ ప్రైమ్ విడుదల అయిన ఈ చిత్రం వచ్చే వారం అంటే జూన్ 23వ తేదీ నుండి అందరి సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులోకి రానుంది. అయితే ఓటీటీ లో విడుదలైన తరువాత కూడా సర్కారు వారి పాట రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంది.

మహేష్ బాబు హైద్రాబాద్ గచ్చిబౌలి లో AMB సినిమాస్ పేరిట ఒక భారీ షాపింగ్ మాల్ మరియు మల్టీప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ధియేటర్ లో సర్కారు వారి పాట ఒక అరుదైన రికార్డు దక్కించుకుంది.

READ  ఏనుగునే భయపెట్టిన విక్రమ్

అదేంటంటే AMB ధియేటర్ లో 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచిందీ సర్కారు వారి పాట. ఇక అన్ని భాషలు కలిపి 4.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన రికార్డ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ పేరిట ఉంది. ఇక మహేష్ బాబు తదుపరి చేయబోయే సినిమాలు ఒకటి త్రివిక్రమ్ తో ఇంకోటి రాజమౌళి తో. ఆ చిత్రాలతో ప్రాంతీయ రికార్డు లే కాక పాన్ ఇండియా మరియు అంతర్జాతీయ రికార్డులు కొల్లగొడతాడు అని ఆశిద్దాం. 

Follow on Google News Follow on Whatsapp

READ  మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న పవన్?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories