టాలీవుడ్ స్టార్ నటుడు నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం మొన్న ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. అక్కడక్కడా సినిమాలో కొద్దిపాటి లోపాలున్నప్పటికీ కూడా ఓవరాల్ గా మంచి టాక్ రావడంతో యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
తమిళ దర్శకుడు నటుడు అయిన ఎస్ జె సూర్య విలన్ గా నటించిన ఈ మూవీలో సాయి కుమార్, అజయ్ ఘోష్, మురళి శర్మ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో గ్రాండ్ గా నిర్మించిన సరిపోదా శనివారం మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ మూవీ రెండవ రోజు కూడా పర్వాలేదనిపించే కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 6 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ మూవీ రెండవ రోజు రూ. 3 కోట్లు రాబట్టింది. ఇప్పటివరకు సరిపోదా శనివారం మూవీ తెలుగు రాష్ట్రాల్లో 30% అలానే వరల్డ్ వైడ్ గా 40% బిజినెస్ ని రికవరీ చేసింది. ఇక శని, ఆదివారాల్లో మరింత బాగా రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.