నాచురల్ స్టార్ నాని ఇటీవల హాయ్ నాన్న మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. యువ దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎమోషల్ ఎంటర్టైనర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో నాని చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి మూవీ మంచి విజయం అందుకోవడంతో దీని పై నాని ఫ్యాన్స్ ఆడియన్స్ లో మరింతగా అంచనాలు ఏర్పడ్డాయి. అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఎస్ జె సూర్య కీలక పాత్ర చేస్తున్న సరిపోదా శనివారం మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకోగా థియేట్రికల్ ట్రైలర్ ని ఆగష్టు 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 29న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.