Home సినిమా వార్తలు Saripodhaa Sanivaaram OTT Release Date ‘​సరిపోదా శనివారం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Saripodhaa Sanivaaram OTT Release Date ‘​సరిపోదా శనివారం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

saripodhaa sanivaaram

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోష్ లో ఉన్నారనే చెప్పాలి. తాజాగా యువ దర్శకడు వివేక్ ఆత్రేయతో ఆయన చేసిన మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ మూవీలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించగా అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. 

డివివి దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో తన ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు నాచురల్ స్టార్ నాని. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ మూవీ ఇటీవల రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకుంది. 

త్వరలో థియేట్రికల్ రన్ పూర్తి కానున్న సరిపోదా శనివారం మూవీ యొక్క ఓటిటి ప్లాట్ ఫామ్ మరియు రిలీజ్ డేట్ నేడు అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీని ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ వారు సెప్టెంబర్ 26న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తమ ఆడియన్స్ ముందుకి తీసుకురన్నట్లు ప్రకటించారు. మరి థియేటర్స్ లో అందరినీ అలరించిన ఈ మూవీ ఓటిటిలో ఎంతమేర రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version