నాచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తన డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై గ్రాండ్ గా నిర్మించగా జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు.
కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీలో యువ అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన సరిపోదా శనివారం మూవీ ఇటీవ ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా అటు ఓవర్సీస్ లో సైతం ఈ మూవీ ప్రస్తుతం ఆకట్టుకునే స్థాయిలో కలెక్షన్ రాబడుతోంది.
ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డీటెయిల్స్ కి సంబంధించి తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 27న ఇది ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్నట్లు చెప్తున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అయితే పక్కాగా అదే రోజున సరిపోదా శనివారం మూవీ ఆడియన్స్ ముందుకు వస్తుందో లేదో తెలియాలి అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే.