నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ సరిపోదా శనివారం. తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీ టీజర్ ని నేడు నటుడు ఎస్ జె సూర్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసారు. టీజర్ లో యాక్షన్ మాస్ అంశాలు ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా నరకాసురుడు, శ్రీకృష్ణుడు, సత్యభామ రెఫరెన్సు తో నాని బ్యాక్ గ్రౌండ్ లో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది.
అలానే విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందిన సరిపోదా శనివారం టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగడంతో పాటు ఆడియన్స్ ఫ్యాన్స్ లో మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా ఈ మూవీని ఆగష్టు 29న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.