Homeసినిమా వార్తలుSaripodhaa Sanivaaram Censor and Runtime 'సరిపోదా శనివారం' సెన్సార్ & రన్ టైం డీటెయిల్స్

Saripodhaa Sanivaaram Censor and Runtime ‘సరిపోదా శనివారం’ సెన్సార్ & రన్ టైం డీటెయిల్స్

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకుని మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఆగష్టు 29న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ మూవీ సక్సెస్ పై టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

విషయం ఏమిటంటే, తాజాగా సరిపోదా శనివారం సెన్సార్ పూర్తి కావడంతో పాటు మూవీ యొక్క రన్ టైం కూడా లాక్ అయింది. కాగా ఈ మూవీకి సెన్సార్ బోర్డు వారు యు / ఏ సర్టిఫికెట్ కేటాయించారు, అలానే మూవీ 170 నిమిషాలు అనగా 2 గంటల 50 నిమిషాల నిడివితో సాగనుంది. తప్పకుండా తామందరి కష్టం ఫలిస్తోందని, అలానే నా ఫ్యాన్స్ ని కూడా సరిపోదా శనివారం మూవీ ఆకట్టుకుంటుందని హీరో నాని తాజాగా ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు.

READ  Karthi in Surya Kanguva సూర్య 'కంగువ' లో కార్తీ బ్లాస్ట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories