Homeబాక్సాఫీస్ వార్తలుబాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కుకు చేరువవుతున్న కార్తీ సర్దార్

బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కుకు చేరువవుతున్న కార్తీ సర్దార్

- Advertisement -

కార్తీ పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ, తనదైన నటన మరియు అద్భుతమైన సినిమాలతో తమిళ భాషతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. అందువల్లే అతని సినిమాలు రెండు భాషలలో మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. తన ఒక్కో సినిమాను సరైన పద్ధతిలో తమిళ భాషతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తూ క్రమంగా మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నారు.

కార్తీ ఇటీవలే ‘సర్దార్’ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు భాషల్లోనూ సర్దార్ చిత్రం భారీ కలెక్షన్లు రాబట్టింది. శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’తో పాటు విడుదలైన కార్తీ నటించిన ‘సర్దార్’ ప్రేక్షకులను గెలుచుకుంది. ఒక సామాజిక అంశంతో పాటు తగినంత కమర్షియల్ ఎలిమెంట్స్‌ ఉండటంతో ప్రేక్షకులను అలరించింది.

ఇక సర్దార్ బాక్సాఫీస్ వద్ద రెండవ వారాంతంలో అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఇప్పటివరకు సర్దార్ చిత్రం తమిళనాడులో 40 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల గ్రాస్‌ను దాటేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తోంది.

READ  గాడ్ ఫాదర్ సినిమాని ఎవరికీ అమ్మలేదు.. మేమే సొంతంగా రిలీజ్ చేసుకున్నాం - నిర్మాత ఎన్వీ ప్రసాద్

ఇక ఇదే జోరును కొనసాగిస్తూ 100 కోట్ల మార్కు వైపు దూసుకుపోతోంది. అలా చేస్తే కార్తీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఖైదీ (103Cr)ని సర్దార్ దాటేసే అవకాశం ఉంది.

నిజానికి విడుదలకు ముందు సర్దార్ సినిమా పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోయినా, సినిమా చూసిన తర్వాత అందరికీ నచ్చింది. మొదటి రోజు నుంచి సర్దార్ కు మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక సర్దార్ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్రకటించడం జరిగింది. మరి కొన్ని నెలల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కార్తీ తదుపరి నటించబోయే సినిమాలన్నీ సీక్వెల్స్ కావటమే. ఖైదీ-2, పొన్నియిన్ సెల్వన్-2 సినిమాలు ఇంతకు ముందే ఖాయమవగా.. ఇప్పుడు సర్దార్-2 కూడా కొత్తగా ఈ లిస్ట్ లో చేరింది. ఈ మూడు సినిమాల పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

సర్దార్ చిత్రంలో కార్తీ కథానాయకుడిగా నటించగా.. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకం పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే, చంకీ పాండే మరియు లైలా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

READ  రెండవ రోజు కూడా అద్భుతంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories