యువ నటుడు ప్రియదర్శి పులికొండ ప్రస్తుతం నటుడిగా ఒక్కో సినిమాతో మంచి పేరు క్రేజ్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కోర్టు సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇక లేటెస్ట్ గా ఆయన హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సినిమా సారంగపాణి జాతకం. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఒక కీలకపాత్ర పోషించారు. రూప కడువయూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది.
అయితే విషయం ఏమిటంటే తాజాగా ప్రముఖ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల ఆడియన్స్ కి ఇది అందుబాటులో ఉంది.
శ్రీనివాస్ అవసరాల, హర్ష చెముడు, నరేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలంక కృష్ణ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించగా వివేక్ సాగర్ సంగీతం అందించారు. మరి థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఈ సినిమా ఓటీటీలో ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.