టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా వరుస విజయాల సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, ఐశ్వరరాజేష్ హీరోయిన్స్ గా ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. కీలకపాత్రల్లో వీకె నరేష్, వీటీవీ గణేష్, పృథ్వి, సాయికుమార్ తదితరులు నటించారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయి అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంతో నటుడిగా తన మార్కెట్ ని మరింతగా పెంచుకున్నారు వెంకటేష్.
త్వరలో తన తదుపరి సినిమాలు చేసేందుకు సంసిద్ధమవుతున్నారు వెంకటేష్. అయితే విషయం ఏమిటంటే నిన్న జరిగిన ఈ మూవీ యొక్క సక్సెస్ మీట్ లో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అయిన మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అనౌన్స్ చేయబడింది.
దాని ప్రకారం ఈ మూవీని 2027 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మరి మంచి క్రేజీ కాంబినేషన్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనంతరం ఏ స్థాయి విజయవంతం అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు.