Home సినిమా వార్తలు Sankranthiki Vasthunam got Shocking TRP Rating ‘​సంక్రాంతికి వస్తున్నాం’ కి షాకింగ్ టిఆర్పి 

Sankranthiki Vasthunam got Shocking TRP Rating ‘​సంక్రాంతికి వస్తున్నాం’ కి షాకింగ్ టిఆర్పి 

sankrathiki vasthunam

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ల కలయికలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఫస్ట్ డే నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 150 కోట్లకిపైగా షేర్ ని సొంతం చేసుకుని సీనియర్ హీరోస్ లో విక్టరీ వెంకటేష్ కి అతి పెద్ద రికార్డుని అందించింది. 

ఇక థియేట్రికల్ రిలీజ్ అనంతరం అటు ఓటిటి లో కూడా విపరీతంగా క్రేజ్, వ్యూస్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఇటీవల జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శితమై మంచి రెస్పాన్స్ అందుకుంది. 

ఇక నేడు ఈ మూవీ యొక్క టిఆర్పి రేటింగ్స్ బయటకు వచ్చాయి. కాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ 15.92 టిఆర్పిని సొంతం చేసుకుని. కొన్నాళ్లుగా ఓటిటిల యొక్క హవా కొనసాగుతున్నప్పటికీ ఈ రేంజ్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ రేటింగ్ అందుకోవడం నిజంగా షాకింగ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version