విక్టరీ వెంకటేష్ హీరోగా యువ అందాల కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఫ్యామిలి ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీలో వికె నరేష్, పృథ్వీ, సాయి కుమార్, సర్వదమన్ బేజార్జి, విటివి గణేష్ తదితరులు నటించారు.
ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అతి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇంకా చాలా థియేటర్స్ లో మంచి కలెక్షన్ రాబడుతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ యొక్క ఫైనల్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఫిబ్రవరి 10న వైభవంగా జరుపనున్నారు.
పలువురు అతిథులతో పాటు మూవీ టీమ్ మొత్తం కూస్తో హాజరుకానున్న ఈ గ్రాండ్ సక్సెస్ మీట్ యొక్క పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఇప్పటికే రూ. 250 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ మూవీ ఓవరాల్ గా ఎంతమేర రాబడుతుందో చూడాలి.