విక్టరీ వెంకటేష్ హీరోగా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటెర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా ఇతర కీలక పాత్రల్లో సర్వధమన్ బెనర్జీ, వికె నరేష్, విటివి గణేష్, సాయి కుమార్, బబ్లు పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ఇక రిలీజ్ అనంతరం అతిపెద్ద విజయం సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల మేర గ్రాస్ ని అలానే రూ. 150 కోట్ల మేర షేర్ ని సొంతం చేసుకుని వెంకటేష్ కెరీర్ తో పాటు సీనియర్ స్టార్స్ కెరీర్ లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.
ఇక ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ముఖ్యంగా ఓటిటి లో రిలీజ్ అయిన 12 గంటల్లోనే 1.3 వీక్షకులు వీక్షించిన ఈ మూవీ 100 మిలియన్ వ్యూస్ తో గతంలోని ఆర్ఆర్ఆర్, హనుమాన్ మూవీస్ యొక్క రికార్డుని బద్దలుకొట్టి సెన్సేషనల్ రికార్డు నెలకొల్పింది.
ఇక మొత్తంగా 48 గంటల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ 200 మిలియన్ వ్యూస్ తో మరొక రికార్డుని సృష్టించి ప్రస్తుతం దూసుకెళుతోంది. ఇక వచ్చే ఏడాది దీనికి సీక్వెల్ అయిన మళ్ళి సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూపొందనుండగా దానిని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.