Homeసినిమా వార్తలుJawan: షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్, విజయ్ రిజెక్ట్ చేసిన పాత్రలో సంజయ్...

Jawan: షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్, విజయ్ రిజెక్ట్ చేసిన పాత్రలో సంజయ్ దత్

- Advertisement -

పఠాన్ వంటి ఘన విజయం తర్వాత షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం జవాన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా జవాన్ లో ఓ కీలక క్యామియో రోల్ ఉందని, ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరినీ చిత్ర యూనిట్ సంప్రదించిందని వార్తలు వచ్చాయి. కానీ వారు ఈ ఆఫర్ ను అంగీకరించలేదని తెలియవచ్చింది.

ఇప్పుడు వారి స్థానంలో జవాన్ సినిమాలో సంజయ్ దత్ నటిస్తారని చెప్పడం షారూఖ్ అభిమానులను ఉత్సాహపరిచింది. కింగ్ ఖాన్ సినిమాల్లో సంజయ్ దత్ ప్రత్యేక పాత్రల్లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రా వన్, ఓం శాంతి ఓం వంటి చిత్రాల్లో తళుక్కుమని కనిపించి మెప్పించారు. ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా త్వరలో ముంబైలో జరిగే షూటింగ్ లో కూడా భాగం కానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సంజయ్ దత్ దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమా యొక్క మేజర్ షెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్లారు. త్వరలోనే ఆయన ఓ స్టూడియోలో తన సన్నివేశాలని చిత్రీకరించేందుకు నగరానికి రానున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ షారుఖ్ – సంజయ్ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో చిత్రీకరించడానికి విలాసవంతమైన సెట్స్ కూడా వేయనున్నట్లు కూడా చెబుతున్నారు.

READ  Pathaan: రెండవ రోజు నంబర్లతో రికార్డ్ బ్రేక్ చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లిన పఠాన్

సంజయ్ దత్ పాత్ర నిడివి తక్కువే అయినా కీలకమైనది కావడంతో ఆ పాత్రలో కనిపించాల్సిన నటుడిని ఎంపిక చేయడం దర్శకుడు అట్లీకి చాలా కష్టంగా మారిందట. ఏమైతేనేం.. పన్నెండేళ్ళ తర్వాత మళ్లీ షారుఖ్ సంజయ్ కలిసి స్క్రీన్ పై కనిపించనున్నారు.

షారుఖ్, అట్లీ కాంబినేషన్లో మొదటి చిత్రంగా తెరకెక్కుతున్న ‘జవాన్’లో నయనతార, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. జవాన్ సినిమా 2023 జూన్ లో థియేటర్లలోకి రానుంది. భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ ను షేక్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.

Follow on Google News Follow on Whatsapp

READ  Ram Charan: RRR సినిమాకి సోలో క్రెడిట్ తీసుకోవాలని రామ్ చరణ్ తహతహలాడుతున్నారా?


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories