కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి నటిస్తున్న “సమ్మతమే” ట్రైలర్ ఈరోజే విడుదల అయింది. ఈ ట్రైలర్ ను తెలంగాణ ఐటి శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.ట్రైలర్ హీరో చిన్ననాటి సన్నివేశాలు చూపిస్తూ ప్రారంభం అవుతుంది.
బాల్యం లోనే తల్లిని కోల్పోయిన హీరో, ఇంట్లొ తనను చూసుకునే ఆడవాళ్ళు ఉన్నప్పుడే జీవితానికి అర్థం ఉంటుంది అన్న తండ్రి మాటలను మెదడులో మనసులో ముద్రించుకుని మంచి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని,అదే జీవితాశయంగా బతకాలని డిసైడ్ అయిపోతాడు.
అతనికి ఆధునిక భావాలు గల చాందినీ చౌదరి పరిచయం అవుతుంది. ఆమె ఆలోచనలు, భావాలు అతనికి విరుద్ధంగా ఉన్నా పరస్పరం ఆకర్షితులు అవుతారు. ప్రేమను తెలుపుకుని సంతోషంగా ఉన్న సమయంలో కొన్ని విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయినట్టు చూపించారు ట్రైలర్ లో.మరి ఆ విభేదాలు తొలగి ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారా లేదా తెలియాలి అంటే 24న విడుదల అయ్యే సినిమా చూడాల్సింది. మొత్తం మీద అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ ను చక్కగా ఎలివెట్ చేయగా, సతీష్ మాసం కెమెరా పనితనం కూడా బాగుంది.
జూన్ 24న విడుదల అవుతున్న సమ్మతమే ప్రపంచ వ్యాప్తంగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ తరపున విడుదల కానుంది. యుజి ప్రొడక్షన్స్ పతాకం పై ప్రవీణ కంకణాల ఈ సినిమాని నిర్మిస్తున్నారు.