Home సినిమా వార్తలు OTT రిలీజ్ సమ్మతమే అంటున్న కిరణ్ అబ్బవరం

OTT రిలీజ్ సమ్మతమే అంటున్న కిరణ్ అబ్బవరం

యువ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సమ్మతమే’. జూన్ 24న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు రివ్యూల పరంగా మిశ్రమ స్పందన వచ్చినా చిన్న బడ్జెట్, బిజినెస్ కావడంతో బాక్స్ ఆఫీస్ పరంగా విజయం సాధించింది.

థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు అంటే జూలై 15న OTT లో విడుదల కానుంది. ఈ సినిమాకి సంభందించిన స్ట్రీమింగ్ హక్కులను ఆహా యాప్ సొంతం చేసుకుంది.

పెళ్ళికి ముందు ప్రేమంటే నాకు పడదు.. అందులో నేను పడను అంటూనే ప్రేమలో పడిన ఒక యువకుడు.. చివరికి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా..? అమాయకంగా కనిపించే ఆ యువకుడిలో దాగి ఉన్న ఛాందసవాది లక్షణాల వల్ల ఆ అమ్మాయి ఏలాంటి ఇబ్బందులు ఎదుర్కుంది? వాటి వల్ల అతని దగ్గర ఏ విషయాలు దాచాల్సి వచ్చింది అనేది కథ. సున్నితమైన హాస్యంతో పాటు భావోద్వేగాలతోసాగే ప్రేమకథా అయిన ఈ చిత్రం ఓటీటీ లో ఫ్యామిలి ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కిరణ్ ప్రస్తుతం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అనే సినిమా చేస్తున్నారు. అలానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలోనూ నటిస్తున్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేస్తున్న మరో సినిమా సెట్స్ మీద ఉంది. ఇటీవలే ఏఎం రత్నం ప్రొడక్షన్ లో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమాలతో కిరణ్ అబ్బవరం మరిన్ని విజయాలు అందుకుని తన స్టార్డం ను పెంచుకుంటారు అని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version