మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చాలా కాలంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ గా కొనసాగుతున్నారు. కాగా ఈ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి పనిచేయడం అంటే చాలా మంది దర్శకులు, నటీమణులకు నేరుగా బిగ్ లీగ్ లోకి జంప్ అయ్యే అవకాశం ఇచ్చినట్టే. ప్రస్తుతం సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇద్దరి సినిమాలు కూడా నిర్మాణ దశలో ఉండగా, ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 సినిమా చేస్తుండగా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు యాక్షన్ ఎంటర్టైనర్లు దర్శకుడు – నటుడి యొక్క కాంబో కారణంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులుగా మారాయి. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో గతంలో అతడు, ఖలేజా వంటి క్లాసిక్స్ రాగా, చివరిసారిగా పవన్- హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
టాలీవుడ్ కు చెందిన ఈ ఇద్దరు టాప్ స్టార్స్ నటించడంతో పాటు ఈ సినిమాల గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ హీరోలుగా తెరకెక్కుతున్న రెండు సినిమాలలో కూడా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
పూజా హెగ్డే గతంలో మహేష్ బాబుతో మహర్షి సినిమాలో నటించగా, ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన నటించడం ఆమెకు ఇదే తొలిసారి. ఇక టాలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా వెలుగొందుతున్న శ్రీలీల తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నారు.