Homeసినిమా వార్తలుఆసక్తికరంగా ఉన్న సమంత "యశోద" టీజర్

ఆసక్తికరంగా ఉన్న సమంత “యశోద” టీజర్

- Advertisement -

హీరోయిన్ సమంత తాజాగా నటిస్తున్న ప్యాన్-ఇండియా సినిమా యశోద. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రతి పిక్/క్లిప్ ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తిని పెంచుతూ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ చాలా మందిని ఆకట్టుకుంది. ఇక తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉండి అంచనాలను మరింత పెంచింది.

సమంత నటించిన యశోద టీజర్ ఈరోజు మొత్తం 5 భాషల్లో విడుదలైంది. కాగా ఈ టీజర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక టీజర్ విషయానికి వస్తే, సమంత పూర్తిగా కొత్త పాత్రలో కనిపిస్తుంది. ఆమె ఇందులో గుర్తు తెలియని వ్యక్తి నుండి ప్రమాదం ఎదుర్కుంటున్న గర్భిణీ స్త్రీగా నటిస్తున్నారు.

కాగా ఒక గర్భిణీ స్త్రీ కలలో కూడా ఊహించని కష్టాలను ఆమె ఈ సినిమాలో ఎదుర్కున్నట్లుగా కనిపిస్తుంది. యశోద కష్టాలకు అద్దం పట్టినట్లుగా.. ఆమె ఒక చిట్టడవిలో చిక్కుకున్నట్లు టీజర్ లో మనం చూడచ్చు. ఆ కష్టాల చిట్టడవి నుండి యశోద బయటపడుతుందా? లేదా అనేది మాత్రం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సీరీస్ లో రాజి లాంటి కష్టమైన పాత్ర తర్వాత, సమంత మరోసారి అలాంటి పాత్రను పోషిస్తున్నారు. ఒక గర్భిణీ స్త్రీ జీవితంలో అటు మానసికంగా ఇటు శారీరకంగా మానవ మృగం వంటి వాళ్ళతో ఆమె చేసే పోరాటంగా యశోద సినిమా తెరకెక్కినట్లుగా అర్థం అవుతుంది.

READ  నన్ను సూపర్ స్టార్ అని పిలవద్దు - విజయ్ దేవరకొండ

ఆ రకంగా చూసుకుంటే.. యశోద సినిమా కథ చాలా కొత్తగా, ఆసక్తికరమైన థ్రిల్లర్ గా రూపొందినట్లుగా ఉంది. కెరీర్ తొలినాళ్ళ నుండి కూడా స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంలో సమంత తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. గర్భిణీ స్త్రీ తన జీవితం కోసం పోరాడటం అంటే అది ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న ఒక ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం సమంత బాగా కష్టపడి తన నటనను ఉత్తమ స్థాయిలో కనబర్చారని యశోద టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.

యశోద సినిమా నిజానికి ఆగస్ట్ 12న విడుదల కావాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇక కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా యశోద సినిమాలో సమంతతో పాటు, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించారు. హరి-హరీష్‌ల ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించటం జరిగింది.

READ  బింబిసార సీక్వెల్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేం - కళ్యాణ్ రామ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories