సమంత ఒక బ్రాండ్! ఆమె సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుండి, సమంత బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రభావాన్ని చూపించే స్థానాన్ని పొందే వరకు ఆమె ప్రయాణం సాగింది. ఆమె స్టార్ హీరోలతో పోల్చదగిన ప్రత్యేక స్థాయిలో అభిమానులను సృష్టించుకున్నారు. హీరోలతో సమానంగా ఇంత కాలం ఈ స్టార్‌డమ్‌ను కొనసాగించగలిగిన నటీమణులు చాలా తక్కువనే చెప్పాలి. ఓ బేబీ!, యూ టర్న్ వంటి సినిమాలు సమంత స్టార్‌డమ్‌కు నిదర్శనంగా నిలిచాయి.
సమంత కొత్త సినిమా యశోద అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 50 కోట్లకు పైగా యశోద అమ్ముడయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యశోద డిజిటల్ రైట్స్ 24 కోట్లకు తీసుకోగా, శాటిలైట్ రైట్స్ 13 కోట్లకు, ఓవర్సీస్ థియేట్రికల్స్ 2.5 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ 11 కోట్లకు అమ్ముడయింది. ఇతర భాషల్లో యశోద సినిమాను నిర్మాతలే తమ సినిమాను సొంతంగా విడుదల చేస్తున్నారు.
ఒక మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాకి ఈ బిజినెస్ సంఖ్యలు నమోదు అవడం అంటే అది సమంత వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ అభిమాన హీరోయిన్ ఈ అరుదైన ఘనత సాధించడం పట్ల సమంత అభిమానులు గర్వపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమా మార్కెట్‌లో ఇంతటి స్టార్‌డమ్‌ని ఆస్వాదిస్తున్న ఏకైక నటి బహుశా సమంత మాత్రమే అనచ్చు.
ఇంతకు ముందు కూడా ఇలా సినిమాలను తామే స్వయంగా తమ భుజాన వేసుకున్న మహిళా సూపర్‌స్టార్‌లను తెలుగు సినిమా చూసింది. జయసుధ, విజయశాంతి, అనుష్క వంటి వారిలో కొందరికి గుర్తుండిపోయే హిట్ సినిమాలు.. మరియు మరపురాని సినిమాలు వారు అందించారు.
ఈ తరంలో సమంత కూడా అదే కోవలో వెళుతూ తనకి సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని ఎదుర్కుని ప్రేక్షకులతో పాటు అభిమానుల హృదయాలను గెలుచుకుని ఎందరో మహిళలకు రోల్ మోడల్ మరియు ప్రేరణగా మారారు. అన్ని భాషల్లోనూ ఆమెకు ఉన్న స్టార్ డమ్ ఆమె ప్రతిభకు నిదర్శనం. రేపు విడుదల కాబోతున్న యశోద చిత్రం సమంతకు మరో ఘన విజయం అందించాలని కోరుకుందాం.