సమంత నటించిన తాజా చిత్రం యశోద ఈ వారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా వారాంతపు రోజుల్లో బాక్సాఫీస్ ప్రదర్శన తెలుగు మరియు తమిళ భాషల్లో అద్భుతంగా ఉండింది. విమర్శకులు కూడా సినిమాలోని సాంకేతిక అంశాలను మెచ్చుకున్నారు.
అయితే ఆ తర్వాత సోమవారం నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త ఇబ్బంది పడుతోంది. సాధారణ వారం రోజులలో కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించింది. వీకెండ్‌లో కనిపించిన అద్భుతమైన జోరు తరువాతి రోజుల్లో నెమ్మదించింది. నవంబర్ బాక్సాఫీస్‌కు డల్ సీజన్ కాబట్టి, కలెక్షన్లలో డ్రాప్ ఉండడం సహజమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడానికి ఇంకా 6 కోట్లు రాబట్టాలి. ఇది జరగాలంటే, రెండవ వారాంతం వసూళ్లు బలంగా ఉండాలి. వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగాలి.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి హరి-హరీష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
సరోగేట్ తల్లుల అండర్‌గ్రౌండ్ రాకెట్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. యశోదగా సమంత ఎలా సాహసోపేతంగా ఆ సవాళ్ల నుండి బయటపడి విలన్ల గుట్టు రట్టు చేసింది అనేది ప్రతి ఒక్కరినీ తెరపైకి అతుక్కుపోయేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌కి ఏకగ్రీవ ప్రశంసలు లభించగా, సెకండ్ హాఫ్ ఇంకాస్త బాగుండాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డారు.
రెండవ వారాంతంలో యశోద నిదానంగా సాగిపోకుండా బాక్సాఫీస్ వసూళ్లను వేగవంతం చేస్తే బాగుంటుంది. ఈ సినిమా విజయవంతమైతే మహిళా ప్రధాన పాత్రల ఇతివృత్తంతో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవాలని ఆశిద్దాం.