Homeసినిమా వార్తలుShaakunthalam: పేలవమైన గ్రాఫిక్స్, డబ్బింగ్ తో నిరాశపరిచిన సమంత శాకుంతలం ట్రైలర్

Shaakunthalam: పేలవమైన గ్రాఫిక్స్, డబ్బింగ్ తో నిరాశపరిచిన సమంత శాకుంతలం ట్రైలర్

- Advertisement -

సమంత రుత్ ప్రభు తన రాబోయే చిత్రం శాకుంతలం ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసారు. దేవ్ మోహన్ కూడా నటించిన ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన కాళిదాసు సంస్కృత నాటకం ‘అభిజ్ఞన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ , హిందీ, మలయాళ , కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

అయితే ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ మేకర్స్ ఆశించిన స్థాయిలో లేదు అనే చెప్పాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా శాకుంతలం. నిజానికి ఇలాంటి సినిమాలకు ప్రమోషనల్ కంటెంట్ అనేది చాలా కీలకం ఎందుకంటే అవి ఒక్కసారిగా ప్రేక్షకుల అంచనాలను పెంచుతాయి.

Shaakuntalam Trailer

కానీ శాకుంతలం ట్రైలర్ పేలవమైన నిర్మాణ విలువలు మరియు తక్కువ స్థాయి విజువల్స్ తో అందరినీ నిరాశపరిచింది మరియు వాస్తవానికి ట్రైలర్ లో కళాకారుల డబ్బింగ్ కూడా పేలవంగా కనిపిస్తుంది. సమంత లుక్, డైలాగ్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి, ఎందుకంటే ట్రైలర్ చూసిన వారిలో అవి ఎటువంటి ప్రభావాన్ని కలిగించలేదు.

READ  RRR: ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కల తీరేనా - ఈరోజే రానున్న నామినేషన్ల లిస్ట్

శాకుంతలం ట్రైలర్ చూసిన తర్వాత అందులోని గ్రాఫిక్స్, సమంత లుక్స్ ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా కొంతమంది అయితే ఏకంగా టివీ సీరియళ్లతో పోల్చి అపహస్యం చేశారు.

మహాభారతంలోని శకుంతల మరియు దుష్యంత మహారాజుల ఇతిహాస ప్రేమ కథ చుట్టూ శాకుంతలం కథ తిరుగుతుంది, ఇందులో సమంత మరియు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కశ్యప కనుమలు (కాశ్మీర్) లో జరిగే ఒక అసాధారణ ప్రేమ కథగా దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిషు సేన్ గుప్తా తదితరులు నటించారు. ఈ చిత్రం 2023 ఫిబ్రవరి 17 న థియేటర్లలోకి రానుంది.

Follow on Google News Follow on Whatsapp

READ  అన్‌స్టాపబుల్ షో నుండి బాలకృష్ణ - ప్రభాస్ ఫోటోలు వైరల్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories