సమంత రుత్ ప్రభు నటించిన పాన్ ఇండియా సినిమా శాకుంతలం ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ పౌరాణిక చిత్రం కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించబడింది. మహాభారతంలోని దుష్యంత రాజు, శకుంతల ప్రేమకథ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
సమంత నటించిన శాకుంతలం చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ , పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
శకుంతల, రాజు దుష్యంత్ ఇద్దరూ ప్రేమలో పడే ఒక అద్భుత ప్రేమ గాథను ఈ సినిమా ట్రైలర్ లో చూపించారు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, సన్నివేశాలతో సినిమా మనల్ని ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కాగా ఈ పౌరాణిక చిత్రంలో దేవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తూ సమంతతో రొమాన్స్ చేయనున్నారు.
సమంత చివరిసారిగా యశోదలో కనిపించారు. ఇక శాకుంతలం తర్వాత ఆమె రుస్సో బ్రదర్స్ వారి సిటాడెల్ లో కూడా నటించనున్నారు. తనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉందని ఆమె వెల్లడించినప్పటి నుండి, సమంత అభిమానులు మరియు ప్రేక్షకులు ఆమె గురించి ఎంతో ఆందోళన చెందుతున్నారు మరియు ఆమె కోలుకోవాలని ప్రార్థించారు.
ప్రముఖ నాటకం శాకుంతలం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ భరతుడి పాత్రలో నటిస్తోంది. గుణ టీమ్ వర్క్స్ పతాకం పై నీలిమ గుణ దిల్ రాజుతో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అదితి బాలన్, ప్రకాష్ రాజ్, గౌతమి, మధూ, సచిన్ ఖేడేకర్, అనన్య నాగళ్ల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.