Homeసినిమా వార్తలుబాలివుడ్ లోకి అడుగు పెట్టనున్న సమంతా

బాలివుడ్ లోకి అడుగు పెట్టనున్న సమంతా

- Advertisement -

దక్షిణ భారత ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో సమంతా రుత్ ప్రభు ఒకరు. ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో ఊ అంటావా మామా పాటతో ఒక్కసారిగా దేశాన్నే ఒక ఊపు ఊపేసిన సమంతా, ఇక బాలీవుడ్ లో అడుగు పెట్టడం లాంఛనమే అంటున్నాయి సినీ వర్గాలు.

రాజ్ & డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్-2 వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఆరంగ్రేటం చేసిన సమంతా, తన పెర్ఫార్మన్స్ తో హిందీ ప్రేక్షకులతో పాటు OTT వీక్షకులనూ ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో రెండు హిందీ సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ తాప్సీ పన్నూ నిర్మించే ఓ హిందీ సినిమాలోసమంతా నటించనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా తాప్సీ ఈ విషయాన్ని ధృవీకరించడంతో అదే ఆమె మొదటి బాలీవుడ్ సినిమా అనుకుంటుండగా, మరో సమాచారం ప్రకారం సమంతా ఇప్పటికే తన తొలి హిందీ సినిమాకు సంతకం చేసారని తెలుస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సరసన సమంతా హీరోయిన్ గా కనపించబోతున్నారని సమాచారం. దీని తరువాతే తాప్సీ ప్రొడక్షన్ లో సమంత సినిమా ఉండే అవకాశం ఉందట.

READ  ఏనుగునే భయపెట్టిన విక్రమ్

ఇదిలా ఉండగా బాలీవుడ్ లో మరో యువ వరుణ్ ధావన్ తో సమంత ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ‘సిటాడెల్’ అనే హాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ కు ఇది ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నురాజ్ & డీకే రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్ – సమంతా ఇద్దరూ గూఢచారులుగా కనిపించనున్నారు. 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ సిరీస్ విడుదల అవబోతుంది.

ఇప్పటి వరకు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంతా ఇప్పుడు నార్త్ లో సత్తా చాటడానికి సరైన మార్గంలోనే వెళ్తున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు.అలానే తమిళంలో విజయ్ – శివ కార్తికేయన్ లతో సినిమాలు చర్చల దశలో ఉన్నాయని సమాచారం. ఇక ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow on Google News Follow on Whatsapp

READ  ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం టీజర్ : అల్లరి నరేష్ నుండి మరో మంచి ప్రయత్నం


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories