Home సినిమా వార్తలు Samantha: ‘శాకుంతలం’ డిజాస్టర్ రిజల్ట్ పై ఓ ఫోటో ద్వారా స్పందించిన సమంత

Samantha: ‘శాకుంతలం’ డిజాస్టర్ రిజల్ట్ పై ఓ ఫోటో ద్వారా స్పందించిన సమంత

తన తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సమంత రుత్ ప్రభు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భగవద్గీత శ్లోకం. ఫలితాల గురించి ఆలోచించకుండా కష్టపడి పనిచేయడం అనే అర్థం వచ్చేలా ఆ శ్లోకం ఉంది. కాగా ఆ ఫొటోలో సమంత కిటికీలోంచి బయటకు చూస్తోన్న విధానం, సీట్ బెల్ట్ ధరించి ఉండడం చూస్తుంటే కారులో ఫొటో తీసినట్లు తెలుస్తోంది.

సమంత తన పోస్ట్ లో.. Karmanye vadhika raste.. Ma phaleshu kadachana.. Ma karma phala he tur bhuh.. Ma te sangotsva karmani అనే శ్లోకం రాసుకొచ్చారు. అంటే పని చేయడం నీ కర్తవ్యం అయి ఉండాలి కాని ఫలితంతో సంబంధం ఉండకూడదు అనే అర్థం వస్తుంది.ఇదే డైలాగ్ ను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ను జైలులో బందీగా ఉండే సన్నివేశంలో వాడారు.

సమంత అలా ఇన్ స్టా లో పోస్ట్ షేర్ చేసిన వెంటనే ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా పలు సందేశాలతో కామెంట్ సెక్షన్ ను ముంచెత్తారు. సమంత అపజయాలకు కృంగిపోకుండా బలంగా ఉండాలని, తన తర్వాతి సినిమాతో భారీ విజయం సాధిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే గుణశేఖర్ దర్శకత్వం వహించగా సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమా చుట్టూ దరైన క్రేజ్ ను క్రియేట్ చేయడంలో ప్రమోషనల్ మెటీరియల్ ఏమాత్రం సక్సెస్ కాకపోవడం, ఇక విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి టాక్ కూడా చాలా పేలవంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version