టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడాకులకు సంబంధించి నేడు కాంగ్రెస్ నాయకురాలు కొండాసురేఖ చేసిన సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు అక్కినేని నాగార్జున. ఎన్ కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే హీరోయిన్ సమంతని తన దగ్గరకు పంపాలని కేటీఆర్ కండీషన్లు పెట్టారన్నారని, కాగా ఆమెను కేటీఆర్ వద్దకు వెళ్లాలని నాగచైతన్య, నాగార్జున కండిషన్లు పెట్టారని అన్నారు. అందుకే చైతన్య నుండి సమంత విడాకులు తీసుకుందని కొండా సురేఖ అన్నారు.
అయితే కొద్దిసేపటి క్రితం కొండాసురేఖ కామెంట్స్ పై పవర్ఫుల్ గా ఒక నోట్ ద్వారా స్పందించారు సమంత. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పని చేయడానికి, స్త్రీలు ఎక్కువగా ఆసరాగా భావించబడని ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడటానికి మరియు ప్రేమలో కొనసాగడానికి, ఇంకా నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ గారు. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను.
దయచేసి దీన్ని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు గణనీయమైన విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.
అటువంటి విషయాలను ప్రైవేట్‌గా ఉంచాలనే మా ఆలోచనని తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించదు. నిజానికి నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి, ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను మరియు అలానే కొనసాగించాలనుకుంటున్నాను.ఆమె పోస్ట్ చేసిన నోట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.