టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు కొన్నేళ్ల క్రితం అక్కినేని కుటుంబ మూడవ తరం వారసుడు అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకుని ఇటీవల కొన్ని కారణాల వలన విడిపోయిన విషయం తెల్సిందే. ఆ తరువాత ఆమె మాయోసైటిస్ అనే వ్యాధికి కూడా గురయ్యారు.
ఆ విధ్దంగా రెండు సమస్యలతో మానసికంగా అలానే శారీరకంగా తాను ఎంతో వేదన చెందానని ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో తెలిపారు సమంత. ఇక తాజాగా సమంత ఇంట ఒక పెను విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు నేడు కన్నుమూశారు. ఆ విషాద విషయాన్నీ కొద్దిసేపటి క్రితం సమంత తన ఇన్స్టాగ్రమ్ స్టోరీ ద్వారా తెలిపారు. అయితే పక్కాగా ఆయన మరణానికి కారణం మాత్రం తెలియరాలేదు. అనారోగ్యంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.
మనం మళ్ళీ కలిసే వరకు నాన్న అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజిని సమంత తన ఇన్స్టా లో షేర్ చేసారు. దానితో పలువురు సమంత అభిమానూలు మరియు ప్రేక్షకులు ఆమె తండ్రి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే ఎంతో మానసిక వేదనకు గురవుతున్న సమంత ఫ్యామిలీలో సడన్ గా ఇటువంటి పెను విషాదం చోటుచేసుకోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.