Homeసినిమా వార్తలుఆటో ఇమ్యూన్ కండీషన్ తో బాధ పడుతున్న సమంత

ఆటో ఇమ్యూన్ కండీషన్ తో బాధ పడుతున్న సమంత

- Advertisement -

హీరోయిన్ సమంత రుత్ ప్రభు, శనివారం తన సోషల్ మీడియా అకౌంట్లైన ట్విట్టర్ మరియు ఇన్‭స్టాగ్రామ్ పోస్ట్‌లలో తన అనారోగ్యం గురించి తెలిపి అభిమానులందరినీ షాక్ కు గురి చేశారు. కాగా కండరాలు బలహీనపడటానికి దారితీసే మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

తన ఆరోగ్యంపై అప్‌డేట్‌ను పంచుకుంటూ సమంత, “నేను అతి త్వరలో పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా ఉన్నారు” అని రాశారు.

నేరుగా ఆసుపత్రి నుండి ఒక చిత్రాన్ని పోస్ట్ చేస్తూ, సమంత ఈ మాటలతో నోట్‌ను ప్రారంభించారు.. “యశోద ట్రైలర్‌కి మీ స్పందన చాలా బాగుంది. మీ అందరితో నేను పంచుకున్న ఈ ప్రేమ మరియు అనుబంధం, జీవితం నా పై విసురుతున్న అంతులేని సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు శక్తిని ఇస్తుంది.. కొన్ని నెలల క్రితం నాకు మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది ఉపశమనం పొందిన తర్వాత దీన్ని షేర్ చేయాలని నేను ఆశించాను. కానీ నేను అనుకున్నదానికంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటోందని నేను నెమ్మదిగా గ్రహిస్తున్నాను. మనం ఎల్లప్పుడూ బలమైన ముందంజ వేయాల్సిన అవసరం లేదు. ఈ దుర్బలత్వాన్ని అంగీకరించడం అనేది నేను ఇప్పటికీ పోరాడుతున్న విషయం.”

READ  సమంత తాజా చిత్రం యశోద పై ట్రేడ్ వర్గాల ఆసక్తి

ఇక తాను కోలుకుంటున్నట్లు రాస్తూ, “నేను అతి త్వరలో పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంగా ఉన్నారు. జీవితంలో నాకు మంచి రోజులు మరియు చెడు రోజులు ఎదురు పడ్డాయి… శారీరకంగా మరియు మానసికంగా…. మరియు ఎప్పుడు కూడా నేను ఇంక ఒక్క రోజు కూడా తట్టుకోలేను అనిపించినప్పుడు, ఏదో ఒక విధంగా ఆ క్షణం గడిచిపోతుంది. నేను కోలుకోవడానికి మరో రోజు దగ్గరగా ఉన్నానని మాత్రమే దీని అర్థం అని అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.” అని చెప్తూ ఈ అనారోగ్యం సమస్య తొందరలోనే బాగవుతుందని సమంత ఆశించారు.

సమంత నటించిన తాజా చిత్రం యశోద ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రయిలర్‌లో సమంతను సరోగసికి ఒప్పుకునే మహిళగా చూపించారు. తీవ్రమైన వైద్య నేరాలకి సంబంధించిన రహస్యాలను ఒక మహిళ ధైర్యంగా ఎలా ఎదురుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది.

తమిళం మరియు తెలుగు భాషలలో చిత్రీకరించబడిన యశోదను హిందీ, కన్నడ మరియు మలయాళం భాషలలో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. హరి మరియు హరీష్ దర్శకత్వం వహించిన యశోద నవంబర్ 11 న విడుదల కానుంది. కాగా సమంత విజయ్ దేవరకొండతో కలిసి తదుపరి రొమాంటిక్ డ్రామా చిత్రం ఖుషిలో కూడా కనిపిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమా థియేటర్లలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  డిజె టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ మార్పు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories